Thank you for everything.....
రాజా హుసేన్ గారి టైంలైన్ లో వారు రాసే ఆర్టికల్సు... పరిచయాలు విశ్లేషణలు ఎన్నో ఎన్నో ఉంటాయి అతని టైం లైన్ ఒక లైబ్రరీ... రోజు వారి టైం లైన్ చూడడం నాకు నచ్చిన అలవాటు...అందులో నాకు అన్నింటికంటే ఎక్కువ ఆకట్టుకునేది మొదట వారి కవితలు.. విరబూసి రాలిన పారిజాతాలైన..పచ్చి జ్ఞాపకాలు... అందులోని ' ఆమె ' నాకు ఓ కదిలే చిత్రం... మనసున ఒదిగే అపురూప శిల్పం...అతడు రాసిన పదాలు అప్పుడప్పుడు మా ఇంట్లో తిరిగాడినట్టు .. సొంతగూటి అక్షరాలుగా అనిపిస్తాయి...
ఇంకోటి కవితా విశ్లేషణలు ...పరిచయాలు.. వీరి కవితా విశ్లేషణ చూసినప్పుడల్లా చాలా అద్భుతంగా అనిపించేవి తర్వాత తర్వాత ఎప్పుడైనా ఇక్కడ నాకంటూ ఒక మాట ఉంటుందా అనిపించేది... ఉంటే బాగుండు అని ఆశ కూడా ... అనుకోకుండా రాజా హుసేన్ గారి నుండి నా కవితలపై విశ్లేషణ రావడం మరువలేని మరిచిపోని జ్ఞాపకం ఇప్పటికీ ఎప్పటికీ...
Abdul Rajahussain గారు రాసిన ప్రతీ కవితల విశ్లేషణ చదువుతాను.. విశ్లేషణ చదివాక కచ్చితంగా వాళ్ళ టైం కి వెళ్లడం అలవాటయిపోయింది... కాకపోతే అవన్నీ పబ్లిక్ పోస్టింగ్స్ కాబట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలి ఫ్రెండ్ అయ్యి ఉండాలి అన్న నియమం ఏమీ లేదు కాబట్టి అలా సాగిపోయేది...
ఇలాంటి అలవాటు ఒకటి ఉందని నాకు Geeta Vellanki ని చూశాక తెలిసింది...కలిశారు పలకరించారు.. మీ ఫ్రెండ్ గా ఉన్నానా అని అడిగారు ..ఉండే ఉంటారు అనుకున్నా... అప్పుడే తెలిసింది కవితలు నచ్చాక ...ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అని... గీత గారి ప్రేమ కవితలు కి నేను ఫిదా ... గీతా గారి డార్క్ ఫాంటసీ కవితా సంపుటి ..కథల పుస్తకం కంటే వేగంగా పూర్తి చేశాను... కథల పుస్తకాల నుంచి కవితల పుస్తకానికి మారడం మొదలు పెట్టింది ఇక్కడి నుండేనేమో...గీత కవితలకే కాదండోయ్ మాటలకి కూడా ఫిదా...
అనుకోకుండా అతడి కవితా సంపుటి ( ఖయాల్) నాకు చేరింది రాజా హుస్సేన్ గారి నుండి.. Syed Mahaboob Subhani గారి చిన్ని చిన్ని కవితలు ఎంతగానో నచ్చేశాయి .. వేకువజాము నక్షత్ర మంతా... ఎప్పుడి నుంచో వెతుకుతున్న కొన్ని ప్రశ్నలకి సమాధానం అందించింది.. అరుదుగా కనిపించే ప్రేమ కవితలో విలక్షణమైన ముగింపు బాగుంటుంది..ఇతని అక్షరాల కాదండోయ్ మనిషి కూడా సున్నితమే... అతనే రాజాహుసేన్ గారి చిన్ననాటి స్నేహితుడు సుభానీ గారు... ఇది నాకు కొంచెం అబ్బురమే...
ఇతను రాసే అనుసృజన కవితలు.. యుద్ధ కవితలు చాలా పేరు తెచ్చి పెట్టాయి.. రాజా హుసేన్ గారి రివ్యూలో స్థానం సంపాదించుకున్నాయి. Cv Suresh గారి ఎన్నో కవితలు మధ్యన అప్పుడప్పుడు తలుక్కుకుంటూ ప్రేమ కవితలు కనిపిస్తాయి... విచిత్రమేమంటే చదివిన ప్రతిసారి చాలాసేపు కట్టిపడేస్తాయి..... అయినా నాకు కొంచెం ప్రేమ కవితలు పై మక్కువ ఎక్కువ కాబోలు.. సివి సురేష్ # గులాబీల ప్రేమ కవితలకు ఆశ్చర్యపోయి అబ్బురపడి అక్షరాలకు బందీ అయ్యాను.
ఇలా ఎందరి అక్షరాలో....పరిచయాలూ... కవితపై మక్కువ మీ వల్లనే అందుకున్నానని నా నమ్మకం.
మనసు మనుషులు అక్షరాలు ఏవైనా కానీ అదృష్టం ఉంటేనే మన వరకు వస్తాయి మన చేతుల్లో ఒదిగిపోయే మనతో ఉండి పోతాయి అని ఖచ్చితంగా నమ్ముతాను..
ఇలా అక్షరాలు.. భావాలు నా వరకు రావడానికి మీరే మొదటి కారణం......నాకు మీరు అందించిన అద్భుతమైన గిఫ్ట్ రాజా హుసేన్ గారు.... thank you